మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ...

SMTV Desk 2019-03-11 11:34:10  andhrapradesh chief minister, nara chandrababu naidu, ysrcp, ys jagan mohan reddy, andhrapradesh assembly elections

అమరావతి, మార్చ్ 11: నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకాల్సి అవసరం లేదని. తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మనకు తేడా అదేనని అన్నారు. అలాగే ఈ 30 రోజుల సమగ్ర ప్రణాళికతో ఎన్నికలకు కదం తొక్కాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి పార్టీ నేర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తించి మరింత అప్రమత్తంగా ఉండాలని క్యాడర్‌కు సూచించారు. మీ భవిష్యత్‌ నా బాధ్యత అనే టిడిపి నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ అనే నినాదంతో జగన్ ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపి చూపారని గుర్తు చేశారు. దీని బట్టే ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని చందబాబు అన్నారు.