విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించిన “RRR”

SMTV Desk 2019-03-11 11:09:53  RRR,

హైదరాబాద్, మార్చ్ 11: ఇప్పుడు టాలీవుడ్ లోని ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “RRR” కూడా ఒకటి.దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే బాహుబలి రెండు సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమా సామర్ధ్యతను ప్రపంచానికి రుచి చూపించారు.ఇప్పుడు అందుకు తగ్గట్టు ఇద్దరు సమ ఉజ్జీలను పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.రాజమౌళి దెబ్బకు ఓవర్సీస్ లో మార్కెట్ బాగానే పెరిగింది.దానికి తోడు ఇద్దరు మాస్ హీరోలు కలయిక కావడంతో బిజినెస్ లో ఈ సినిమాకు భారీ ధరలు పలుకుతున్నట్టు సమాచారం.ఈ సినిమా మేకర్స్ ఓవర్సీస్ లో ఈ సినిమా రైట్స్ కోసం 75 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట..ఈ స్థాయిలో కానీ ఈ సినిమా అమ్ముడుపోతే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డే అని చెప్పాలి.మరి ఈ భారీ ప్రాజెక్టుని నమ్మి ఇంత పెద్ద మొత్తంలో ఈ సినిమాని ఎవరు కొంటారో చూడాలి.