ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దగ్గరి బంధువు

SMTV Desk 2019-03-11 10:09:08  minor rape, police crime, punjab crime, girl rape

చండీగర్, మార్చి 11: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు, ఆ పై హత్య చేశాడు. బాలిక బంధువే ఈ దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసి పోలీసులే నివ్వెరపోతున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని దొరాహా పట్టణంలో బాలిక బంధవు అయిన వ్యక్తి చిన్నారిని వారి ఇంటి నుంచి అపహరించాడు. అనంతరం ఆమెను సమీపంలోనే ఉన్న ఖాళీ గోదాములోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్ని నిందితుడి కోసం గాలిస్తున్నారు.