సినిమా హాల్లో జనగణమన ప్లే చేయడం నాకు నచ్చని విషయం: పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-03-11 08:38:02  pawan kalyan, janasena chief, cinema hall, janaganamana

హైదరాబాద్, మార్చి 11: సినిమా హాళ్లలో జాతీయగీతం వస్తుంటే లేచి నిలబడడం తనకు నచ్చని విషయం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం ఆయన ఓ యూత్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ........ తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే సినిమా థియేటర్లు కాస్తా ఇప్పుడు దేశభక్తి నిరూపించుకునేందుకు వేదికలుగా మారాయని విమర్శించారు.

"జాతీయగీతం సినిమాహాళ్లలోనే ఎందుకు ప్లే చేయాలి? రాజకీయనాయకులు తమ సభలకు ముందు జాతీయగీతం ప్లే చేయొచ్చుగా! అలాగైతే కార్యాలయాల్లో కూడా జనగణమన పాడేలా చూడాలి. ఇలా చేయాలి, అలా చేయాలి అని బోధిస్తూ చట్టాలు తీసుకువచ్చే వాళ్లే మొదట ఈ పని చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవాలి" అంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్.