మాస్ మహారాజా రవితేజ ఇజ్ బ్యాక్

SMTV Desk 2019-03-11 08:37:13  Ravi teja, Teri, Vijay , Movie news,

హైదరాబాద్, మార్చి 11: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి కొంత గ్యాప్ ఇచ్చిన మళ్ళీ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించడానికి రెడీ అయిపోయాడు. ఆల్రెడీ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ చిత్రం షూటింగ్‌ షురూ చేశారు. దీంతోపాటు తేరీ రీమేక్‌ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. విజయ్‌ నటించిన తేరీ చిత్రాన్ని కందిరీగ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెలుగులో రీమేక్‌ అవుతోంది. కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేశారు. ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. లేటెస్ట్‌గా ఏప్రిల్‌ రెండో వారం నుంచి షూటింగ్‌ కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో కేథరిన్‌ కథానాయిక. తమిళ చిత్రాన్ని తెలుగు నేపథ్యానికి సరిపడేలా దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్ చాలా మార్పులు చేశారట. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్న ఈ చిత్రాన్ని దసరా స్పెషల్‌గా రిలీజ్‌ చేయనున్నారు.