ఏపీ జలవనరుల శాఖ వినూత్న నిర్ణయం

SMTV Desk 2017-08-07 14:14:10  AP CM, chandrababu naidu, Chief minister, Polavaram Project, APPSC

అమరావతి, ఆగష్ట్ 7 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా కొత్తగా నియమితులైన 518మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎఈఈ) లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకా పత్రలు ఇస్తారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నియామక ప్రక్రియ ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పోలవరం వద్ద కొత్తగా నియమితులైన ఎఈఈ లను ఆహ్వానిచితే వారికి ఒక ప్రేరణగా ఉపయోగపడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొనారు. జలవనరుల శాఖ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నేటి ఉదయం 10గంటలకు అభ్యర్ధులంతా ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వారంతా పోలవరం చేరుకోవడం కోసం రాజమండ్రి రైల్వే, బస్సు స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.