వైఎస్ జగన్ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశం

SMTV Desk 2019-03-11 07:40:57  ap assembly elections, lok sabha elections, central election commission, ysrcp, ys jagan mohan reddy

అమరావతి, మార్చ్ 10: తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్ 11 న ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న నేతలతో ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తాజా రాజకీయ పరిణామాలపై చర్చకు వచ్చినట్టు సమాచారం.