ఫేస్‌బుక్ మెసెంజర్‌ లోనూ డార్క్ మోడ్ ఫీచర్

SMTV Desk 2019-03-11 07:37:07  facebook, facebook messenger, dark mode feature

మార్చ్ 10: ఫేస్‌బుక్ మెసెంజర్‌ యాప్ లో మరో కొత్త కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యాప్ లో కొత్తగా డార్క్ మోడ్ అనే ఫీచర్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. దీని వ‌ల్ల యూజ‌ర్లు రాత్రి పూట మెసెంజ‌ర్‌ను వాడుతున్న‌ప్పుడు ఈ ఫీచ‌ర్‌ను ఆన్ చేస్తే యాప్ డార్క్ థీమ్‌లోకి మారుతుంది. అయితే ఈ ఫీచ‌ర్‌ను వాడుకోవాలంటే యూజ‌ర్లు హాఫ్ మూన్ ఎమోజీ ని చాట్‌లో పంపాలి. దీంతో ఈ ఫీచ‌ర్ యాక్టివేట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.