నరేష్, శివాజీరాజాలపై జీహెచ్ఎంసీ వేటు!

SMTV Desk 2019-03-11 07:35:03  maa artist association elections 2019, shivajiraja, naresh, ghmc

హైదరాబాద్, మార్చ్ 10: ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి నిల్చున్న పోటీదారులు శివాజీ రాజా, నరేష్ లకు జీహెచ్ఎంసీ అధికారుల నుండి షాక్ తగిలింది. ఎన్నికల సందర్భంగా వారు తమకు సంబంధించిన పోస్టర్లను, ఫ్లెక్షీలను ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవి జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినందుకు గాను ప్రధాన అభ్యర్ధులు శివాజీరాజా, నరేష్ లతో పాటు మరికొంతమందికి పెనాల్టీ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారులు ఛాంబర్ ఎదుట ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఇక శివాజీరాజా, నరేష్ లపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనే విషయంపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. ఇక ఈరోజు ఉదయం మొదలైన ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలైంది. మరికాసేపట్లో రిజల్ట్స్ ప్రకటించనున్నారు.