హిట్ మాన్ - గబ్బర్ : వరల్డ్ రికార్డ్

SMTV Desk 2019-03-11 07:33:16  india vs australia, 4th odi, rohit sharma, shikar dhawan, world record

పంజాబ్, మార్చ్ 10: నేడు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన క్రీజులో అడుగు పెట్టిన దగ్గర నుంచి మంచి పార్టనర్ షిప్ తో జట్టును స్కోర్ కార్డును పరిగెత్తించారు ఓపెనర్స్ రోహిత్, ధావన్. అయితే రోహిత్ 2 సిక్సర్లు, 7 ఫోరులతో విజృంభించి 95 పరుగులు చేసి కేవలం 5 పరుగుల తేడా తో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. రోహిత్ గురి తప్పినా కానీ గబ్బర్ గురి మాత్రం తప్పలేదు. 12 ఫోర్లు ఒక సిక్సర్ బాది కేవలం 97 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసి కంగారులను ఖంగారు పెట్టించాడు. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల సరసన వీరు చేరిపోయారు. విండీస్ దిగ్గజ ఓపెనర్లు గోర్డాన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ లతో సమానంగా నిలిచి అత్యధిక ఓపెనింగ్ సెంచరీ భాగస్వామ్యాల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యాల రికార్డు భారత మాజీ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీల పేరిట వుంది. వీరిద్దరు వన్డే ఓపెనర్లుగా 21 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. వీరి తర్వాత ఆసిస్ మాజీ ఓపెనర్లు గిల్‌క్రిస్ట్‌-మాథ్యూ హేడెన్‌ 16 సెంచరీలతో 2వ స్థానంలో నిలిచారు. వీరి తర్వాత స్థానాన్ని మొహాలీ మ్యాచ్ ద్వారా రోహిత్-ధావన్ జోడీ అక్రమించింది. 193 పరుగుల భాగస్వామ్యం తర్వాత సెంచరీకి చేరువైన రోహిత్ భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. దీంతో రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.