వంగవీటి రాధా టీడీపీ నుంచి పోటీ చేసే నియిజకవర్గం?

SMTV Desk 2019-03-11 07:29:11  vangaveeti radha, ysrcp, tdp, machilipatnam, loksabha elections

విజయవాడ, మార్చ్ 10: వైఎస్సార్ పార్టీ నుంచి బయటకి వచ్చాక వంగవీటి రాధా టీడీపీలో చేరుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రాధా చంద్రబాబుతో విజయవాడలోని ఏవో సమస్యలను దృష్టికి తీసుకెళ్లారని వాటికి సంబంధించి స్పష్టత ఇచ్చిన వెంటనే రాధా టీడీపీలో చేరుతారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజగా రాధా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ నియోజకవర్గం ఇదేనంటూ వార్తలొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లోక్ సభ అభ్యర్థిగా వంగవీటి రాధా మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. దీనిపై టీడీపీ కూడా రాదాకు స్పష్టతను ఇచ్చిందని అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని వారు అంటున్నారు.