నాలుగో వన్డే : 359 పరుగుల లక్ష్యాన్ని ముందుంచిన కోహ్లీ సేన

SMTV Desk 2019-03-11 07:28:10  india vs australia, 4th odi, rohit sharma, shikar dhawan

మొహాలి, మార్చ్ 10: భారత్, ఆసిస్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా 4 మ్యాచ్ మొదలయ్యింది. నాల్గో వన్డేలో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మూడు వన్డేలో భారత్ రెండు గెలిస్తే, కంగారులు ఒకటి గెలిచారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ టీమిండియా కైవసం అవుతుందన్న పట్టుదలతో క్రీజులోకెల్లిన కోహ్లీ సేనా ఆసిస్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. టీం ఇండియా ఓపెనర్లు రోహిత్, ధావన్ ఈ మ్యాచ్ లో చెలరేగిపోయారు. రోహిత్ 2 సిక్సర్లు, 7 ఫోరులతో విజృంభించి 95 పరుగులు చేసి కేవలం 5 పరుగుల తేడా తో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. రోహిత్ గురి తప్పినా కానీ గబ్బర్ గురి మాత్రం తప్పలేదు. 12 ఫోర్లు ఒక సిక్సర్ బాది కేవలం 97 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసి 254 పరుగుల వద్ద ధావన్ 143 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ కూడా 7 పరుగులు చేసి 266 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 26, రిషబ్ పంత్ 36, జాదవ్ 10, విజయ శంకర 26, భువనేశ్వర్ 1, కులదీప్ యాదవ్ 1, బుమ్ర 6 పరుగులు చేసి సరికి మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యింది. మరోవైపు ఆసీస్ జట్టు మూడో వన్డే విజయంతో ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సమం చేయాలని బరిలోకి దిగుతోంది.