చైనాపై యుద్ధానికి భారత్ సిద్ధం: భారత రక్షణశాఖ

SMTV Desk 2017-08-07 13:17:06  China, India, Doklam border, Indian Defense Ministry

న్యూఢిల్లీ, ఆగష్ట్ 7: గత కొద్ది కాలంగా అసోం సరిహద్దు ప్రాంతం డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్‌పై డ్రాగన్ దేశం మాటల యుద్ధం చేస్తూ రోజుకొక రెచ్చగొట్టే వ్యాఖ్య చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం శాంతి సందేశాలు పంపిస్తుంది. కాగా, తాజాగా ఈ సమస్యపై భారత రక్షణశాఖ వర్గాలు స్పందిస్తూ చైనా మనపై యుద్ధానికి దిగే అవకాశాలు ఏమాత్రం లేదన్నారు. ఆ దేశం ప్రకటిస్తున్నట్లు సరిహద్దు ప్రాంతం నుంచి భారత సైనికులను తరిమికొట్టేందుకు ఎలాంటి మిలిటరీ ఆపరేషన్‌ను కూడా ప్రారంభించలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఆ ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ సైనికులను ఉపసంహరించుకోవడం ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పాయి. ఒకవేళ చైనా యుద్ధానికి ముందుకు వచ్చినా, ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని, మనకు ఆ సత్తా ఉందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు కేవలం వందల మీటర్ల దూరంలోనే మోహరించారు. ఇటీవల భారత బాక్సర్ విజేందర్ తను గెలిచిన టైటిల్‌ను చైనాకు తిరిగిచ్చి, సరిహద్దు ప్రాంతంలో శాంతి నెలకునేందుకు ఈ రకంగా సందేశాన్ని పంపిస్తానని ప్రకటించడం గమనించదగిన విషయం.