పవన్ మాకు పోటీయే కాదు : రోజా సెన్సేషనల్ కామెంట్స్

SMTV Desk 2019-03-11 07:22:57  ysrcp mla roja, janasena party, pawan kalyan, ap assembly elections

విజయవాడ, మార్చ్ 10: వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా పవన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలం నుంచి పూర్తి స్థాయిలో బిజీ అయ్యిపోయిన పవన్ అసలు తమకి పోటీయే కాదని, ఇప్పటి వరకు పవన్ అప్పుడప్పుడు బయటకి వచ్చి ఒకటి రెండు సభలు పెట్టుకొని వెళ్లిపోయారు కానీ పూర్తిస్థాయి రాజకీయాలు ఎక్కడా చేయలేదని అన్నారు. ఇప్పటి వరకు పోటీ చెయ్యని నాయకుడు పవన్ అని అసలు అతని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అసలు పవన్ ను తాము ఎన్నికల్లో పోటీకి లెక్కలోకి కూడా తీసుకోవట్లేదు అని మరో సారి సంచలనానికి దారి తీసే వ్యాఖ్యలు చేసారు. పార్టీ పెట్టి ఇప్పటి వరకు పోటీ చెయ్యని వారిని చూసి భయపడడం వారి గురించి ఆలోచించడం వంటివి తాము చెయ్యమని జనసేనాని పై రోజా షాకింగ్ కామెంట్స్ చేసారు.