ఇంటర్వెల్ బ్లాక్ కోసం రూ.30 కోట్లు ఖర్చు

SMTV Desk 2019-03-11 07:16:21  prabhas, saaho, sujeeth, uv creations

హైదరాబాద్, మార్చ్ 10: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సాహో . ఈ సినిమా పై అభిమానుల్లో రోజు రోజుకి భారీగా అంచనాలు పెరుగుతునాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో అప్‌డేట్ షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ నిపుణుల సహకారంతో దుబాయ్‌లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ అంతా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగింది. నిజానికి ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’లో ఆ మేకింగ్ వీడియో చూసే అందరూ థ్రిల్లయ్యారు. ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్‌ను కూడా దాదాపు అలాంటిదే ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ పర్యవేక్షణకు కెన్నీ బేట్స్ హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది. ఈ ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన షెడ్యూల్ కోసం నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఒక ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు టాలీవుడ్‌లో చాలా మీడియం రేంజ్ సినిమాలు ఈ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో ‘సాహో’ ముఖ్య తారాగణం అంతా పాల్గొంటుందట. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.