ప్రశాంతంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు

SMTV Desk 2019-03-11 07:08:43  Rakul preet sing, vijay devarakonda

హైదరాబాద్, మార్చి 10: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఇందులో సుమారు 800 వరకు ఓటు హక్కును కలిగి ఉన్నారు. ‘మా’ సభ్యులైన నటీనటులంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో శివాజీరాజా, సీనియర్ నటుడు నరేష్ పోటీపడుతున్నారు. మా ఎన్నికలతో ఫిల్మ్‌నగర్‌ సందడిగా మారింది. చిరంజీవి, నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, కృష్ణ భగవాన్‌, సాయికిరణ్‌, దాసరి అరుణ్‌కుమార్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.