సైకిలేక్కనున్న వంగవీటి...!

SMTV Desk 2019-03-10 14:59:02  Vangaveeti Radhakrishna, Chandrababu Naidu, Jaganmohan Reddy, Party Changing, TDP, YCP

అమరావతి, మార్చి 10: ఇటీవల పార్టీలో పలు ఆరోపణలతో వైసీపీని వీడారు వంగవీటి రాధాకృష్ణ. తాజాగా ఆయన టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. మరికాసేపట్లో వంగవీటి సైకిల్ ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్నీ మాజీ ఎంపీ లగడపాటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. దీంతో వైసీపీకి కృష్ణ జిల్లాలో గట్టి దెబ్బే తగిలింది. గత కొద్ది రోజుల క్రితం వంగవీటి ఏ పార్టీలో చేరాబోతున్నారో అన్న విషయం జోరుగా ప్రచారం కాగా, ముందుగా జనసేన పార్టీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనను టీడీపీలోకి ఆహ్వానిస్తూ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులూ వ్యాఖ్యలు కూడా చేశారు.