వైసీపీ డబ్బుపై ఆధారపడదు: విజయసాయిరెడ్డి

SMTV Desk 2019-03-10 13:42:29  Vijayasai Reddy, Chandrababu Naidu, Chandrasekhar Rao, YCP, TDP, Return Gift

అమరావతి, మార్చి 10: శనివారం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రూ. 1,000 ఇచ్చినట్లు ఆరోపించారు. తనకు ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.

విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ, "డబ్బు, నయవంచన, మోసం, కులగజ్జి, అరాచకాలతో రాజకీయం చేసేది తమరే చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు రూ.500 కోట్ల విరాళం, గెలిస్తే మరో 500 కోట్లు తిరిగి ఇవ్వాలన్న కండిషన్ పై నిధులు సమకూర్చింది ఎవరో ప్రజలకు తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ డబ్బుపై ఆధారపడదు. ప్రజాధరణ ఉన్న పార్టీ మాది" అని వెల్లడించారు.