ఓటు వేయడానికి వచ్చిన సినీ నటులు

SMTV Desk 2019-03-10 13:38:10  Chiranjeevi, Nagarjuna

హైదరాబాద్ , మార్చి 10: సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పాలకవర్గ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో పోలింగ్ జరుగుతుండగా... ఇప్పటికే ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు ఫిలిం ఛాంబర్ కు వచ్చి, ఓటు వేశారు. ఇద్దరూ కలసి ఒకే కారులో రావడం విశేషం. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం నరేష్, శివాజీరాజాలు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కిపు మొదలవుతుంది.