ప్రముఖ దర్శకుడితో దిల్ రాజు భారీ డీల్..!

SMTV Desk 2019-03-10 09:51:16  Dil raju, anil ravipudi

హైదరాబాద్, మార్చ్ 10: సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డబుల్ హ్యాట్రిక్ కు ప్లాన్ చేశాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుసగా నాలుగు హిట్లు అందుకున్న అనీల్ రావిపుడి తన తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేష్ తో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. మహేష్ మహర్షి పూర్తి కాగానే మే నెలలో అనీల్ రావిపుడి సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఈ సినిమాకు దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మాతలుగా ఉంటారట.

ఇక ఇదే కాకుండా ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్-3 సినిమాను చేయాలని చూస్తున్నాడు. దిల్ రాజు 2021లో ఎఫ్-3ని సెట్స్ మీదకు తీసుకెళ్లలని చూస్తున్నాడు. ఇదే కాకుండా మరో సినిమా కూడా దిల్ రాజుతో చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడట. దిల్ రాజుతో అనీల్ రావిపుడి 3 సినిమాల భారీ డీల్ కుదుర్చుకున్నాడట. మరి అనీల్ చూస్తుంటే డబుల్ హ్యాట్రిక్ తో పాటుగా అదిరిపోయే రికార్డులను సైతం కొల్లగొడతాడని అనిపిస్తుంది.