లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా బాలకృష్ణకు అంకితం

SMTV Desk 2019-03-10 09:40:55  rgv, lakhmis ntr

డైరక్టర్ వర్మ ఏం చేసినా అదో పెద్ద సెన్సేషనే. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో మళ్లీ వార్తల్లో నిలుస్తున్న ఆర్జివి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వదులుతున్న ఒక్కో సాంగ్ సంచలనంగా మారుతుంది. ఇక మొన్నామధ్య వచ్చిన ట్రైలర్ కూడా అదరగొట్టగా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి సెకండ్ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేశారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సింహ గర్జన అంటూ ఓ ఈవెంట్ కూడా జరిపారు.

ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా బాలకృష్ణకు అంకితం ఇస్తున్నా అని అన్నారు. అసలే ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ఫలితాలతో నిరాశలో ఉన్న బాలయ్యకు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంకితం చేయడం వర్మకే చెల్లింది. సినిమా కథ అప్పటి మీడియా మిత్రులు.. కొందరు రాజకీయ నాయకుల నుండి తెలుసుకుని రాశానని అన్నాడు ఆర్జివి. అందుకే సాధ్యమైనంత వరకు వాస్తవానికి దగ్గరగా తీశామని అన్నారు.