బిగ్‌ బాస్ లో మెరిసిన రానా

SMTV Desk 2017-08-07 11:07:57  big boss, ntr, rana, sameer, friendship day,

హైదరాబాద్, ఆగస్ట్ 7: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో లో టాలీవుడ్ హీరో రానా అతిధి గా వచ్చి బుల్లితెర అభిమానులను అలరించారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌ బాస్ హౌస్‌లోకి వచినట్లుగా తెలుస్తుంది. రానాను చూడగానే బిగ్‌ బాస్ హౌస్‌లో ఉన్న 12 మంది సెలబ్రిటీలు చాలా సంతోషంగా కనిపించారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా రానా సమక్షంలో జూనియర్ ఎన్టీఆర్ 12 మందికి సరదా పోటీలు పెట్టారు. పార్టిసిపెంట్స్ అందరూ వాళ్లకు నచ్చని వారికి నల్ల గులాబీ, నచ్చిన వారికి ఎల్లో రోజ్ ఇచ్చేలా టాస్క్ పెట్టారు. ఎందుకు ఆ కలర్ పూలు ఇస్తున్నారో కూడా ఒక వాక్యంలో చెప్పాలన్నారు. బిగ్‌ బాస్ హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశాన్ని ఎన్టీఆర్ రానాకు ఇచ్చారు. ఈ వారం ఎపిసోడ్ లో 6 గురు కంటెస్టంట్స్ ఎలిమినేషన్ ఫేస్ చేయగా అందరిలో సమీర్ ఫైనల్ ఎలిమినేటర్ అయ్యాడు. హౌజ్ మెట్స్ లో ఉత్సాహవంతమైన కంటెస్టంట్ అంటే అది సమీర్ అని చెప్పాలి. వచ్చినప్పటి నుండి ఏ రోజు తను ఇంటిని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్‌ లేకుండా రియాలిటీ షోని అలానే ఆడసాగాడు సమీర్. ఈ సందర్బంగా సమీర్ మాట్లాడుతూ తనకు జీవితంలో ఇలాంటి అనుభూతి మళ్లీ ఎప్పుడు కలగకపోవచున్నని. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందంటూ తెలిపారు.