RRR కోసం కీరవాణి మొదలు పెట్టాడట..!

SMTV Desk 2019-03-10 09:36:35  rrr,

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రస్తుతం మూడవ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయట. బాహుబలి సినిమాకు మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే.

అలానే ఆర్.ఆర్.ఆర్ కు మ్యూజిక్ అదిరిపోయేలా జాగ్రత్తపడుతున్నారట. ఇక ఈ సినిమా 3వ షెడ్యూల్ కలకత్తాలో జరుగనుంది. త్వరలో మొదలవనున్న ఈ షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు పాల్గొంటారట. సినిమాలో హీరోయిన్ గా పరిణితీ చోప్రా, అలియా భట్ లను అడుగుతున్నారట. అలియా భట్ దాదాపు కన్ ఫాం అయ్యిందని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ కు వస్తుందట.