మధ్యవర్తులతో పరిష్కారం సాధ్యం కాదు!

SMTV Desk 2019-03-09 18:43:00  ayodhya case, supreme court, shivasena party

న్యూఢిల్లీ, మార్చ్ 09: అయోధ్య వివాదం పరిష్కారం కోసం సుప్రీం ముగ్గురు సభ్యులతో మధ్యవర్తుల కమిటీని నియమించిన సందర్భంగా ఈ అంశంపై నేడు శివసేన పార్టీ చాలా ఘాటుగా స్పందించింది. అయోధ్య వివాదం మధ్యవర్తులతో పరిష్కారం సాధ్యం కాదని శివసేన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రామాలయ నిర్మాణ విషయంలో కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి, వెంటనే ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. రాజకీయ నాయకులు, పాలకులు, సుప్రీం కోర్టు కూడా అయోధ్య వివాదాన్ని పరిష్కరించలేకపోయారని, అలాంటి సందర్భంలో మధ్యవర్తులు ఏం చేస్తారని ఆ పార్టీ ప్రశ్నించింది. మధ్యవర్తులతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తే, గత 25 ఏళ్లుగా సమస్య ఎందుకు అలాగూ ఉండిసోయిందని శివసేన అనుబంధ పత్రిక సామ్నా ప్రశ్నించింది.