ఢిల్లీ మెట్రో స్టేషన్లకు వీర మరణం పొందిన జవాన్ల పేరు

SMTV Desk 2019-03-09 16:57:27  delhi metro railway corporation, indian prime minister, narendra modi, pulwama attack, srpf army

న్యూఢిల్లీ, మార్చ్ 09: ఢిల్లీ మెట్రోలోని రెండు స్టేషన్ల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చారు. ఆ స్టేషన్లకు పుల్వామా దాడిలో అమర జవాన్ల పేరు పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌ అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌కు సమీపించి ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌ని నరేంద్ర మోడి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేషన్ల పేరు మార్పు విషయాన్ని డీఎమ్ఆర్‌సీ ప్రకటించింది. రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్ పేరును మేజర్ మోహిత్ శర్మ రాజేంద్ర నగర్ స్టేషన్‌గా, న్యూ బస్ అడ్డా స్టేషన్‌ పేరును షహీద్ స్థల్ (న్యూ బస్ అడ్డా)గా పేర్లు మార్చారు.జెండా ఊపిన అనంతరం ప్రధాని మోడి మొదటి ప్రయాణం చేశారు. ఘజియాబాద్‌లోని షహీద్ స్థల్ నుంచి కశ్మీరి గేట్ వరకు ప్రయాణించారు.