యాపిల్ కు షాక్ ఇచ్చిన క్వాల్‌కామ్‌!

SMTV Desk 2019-03-09 16:48:13  Apple & Qualcomm legal tussle, Apple accuses Qualcomm of theft, Qualcomm, Apple

శాన్‌ఫ్రాన్సిస్కో, మార్చ్ 09: చిప్‌తయారీల సంస్థ క్వాల్‌కామ్‌ యాపిల్ కంపెనీకి షాక్ ఇచ్చింది. యాపిల్‌ కంపెనీ మేధోహక్కులను ఉల్లంఘించడం వల్ల దానికి పరిహారంగా 31 మిలియన్‌ డాలర్లు కావాలని పట్టుబడుతోంది క్వాల్‌కామ్‌. ఐఫోన్‌ సంస్థ వారి ఫోన్లల్లో తమ మేధోహక్కులను వినియోగించారన్న వాదనపై ఒక్కొక్క ఐఫోన్‌ పైనా 1.40 డాలర్లు చొప్పున వసూలుచేస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్న అమెరికా కోర్టులో క్వాల్‌కామ్‌కు చెందిన మూడు టెక్నాలజీ పేటెంట్లపై సంస్థకే నెగ్గే అనుకూల వాతావరణం ఉందని తెలుస్తోంది. ఇక యాపిల్‌ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఐఫోన్లలో వినియోగించిందని సినెట్‌ అనే సంస్థ వెల్లడించింది. ఈ టెక్నాలజీసాయంతోస్మార్ట్‌ఫోన్‌ ఆన్‌చేసిన వెంటనే ఇంటర్నెట్‌కు దానంత అదే కనెక్ట్‌ అవుతుందని క్వాల్‌కామ్‌చెపుతోంది. మరో డీల్‌లోగ్రాఫిక్స్‌ ప్రాససింగ్‌, బ్యాటరీ లైఫ్‌కూడా ఆధారపడి ఉంటుంది. వీటివల్ల యాప్‌లను ఫోన్‌నుంచి మరింత వేగంగా సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంటుంది.