లండన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న నిరావ్ మోదీ...

SMTV Desk 2019-03-09 13:56:24  Nirav Modi, London, Staying, Punjab National Bank, International Media, Diamond Business, Vijay Malya

లండన్, మార్చి 9: లండన్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నేరగాళ్ళకు అడ్డాగా మారుతోంది. మొన్నటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముంచేసిన కింగ్ ఫిషర్ వ్యాపారి విజయ్ మాల్య ఆ నగరంలోనే తల దాల్చగా, తాజాగా మరో ప్రముఖ వ్యాపారవేత్త, వజ్రాల వ్యాపారి అయిన నిరావ్ మోదీ లండన్ లో పర్యటిస్తున్నట్లు తెలిసింది. ఏమాత్రం భయం లేకుండా లండన్ వీధుల్లో హాయిగా తిరిగేస్తున్నాడు. భారత్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు కు అప్పు ఎగవేసి పరారైన సంగతి తెలిసిందే. ఇండియా వస్తే అరెస్టు చేస్తారని తెలిసి గడ్డం పెంచి, వేషం మార్చి అక్కడే వజ్రాల వ్యాపారం కూడా చేస్తున్నాడు నీరవ్ మోదీ.

అంతర్జాతీయ మీడియా కూడా నీరవ్ మోదీ గురించి వెతుకుతోంది. అయితే బ్రిటన్‌కు చెందిన ద టెలిగ్రాఫ్ పేపర్ రిపోర్టర్ నీరవ్ మోదీని గుర్తు పట్టాడు. వెంటనే అతని పై వరుస ప్రశ్నల జల్లు కురిపించాడు. కానీ దొంగలా జారుకున్న నిరావ్ మోదీ మాత్రం ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. నో కామెంట్ అంటూ ప్రతి ప్రశ్నకూ పాస్ చెప్పారంట. కాగా అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఓ క్యాబ్‌ ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ క్యాబ్‌ డ్రైవర్‌ నిరాకరించాడు. అనంతరం మరో క్యాబ్‌లో అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో అతను ధరించిన కోటు విలువ 7లక్షలు ఉంటుందని అంచనా.

తాజా సమాచారం ప్రకారం లండన్‌లోని సెంటర్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్‌ ఉంటున్నాడు. కాగా దాని అద్దె 15లక్షల పైమాటే. నీరవ్‌కు సంబంధించి రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను టెలిగ్రాఫ్‌ సంస్థ విడుదల చేసింది.