మీ తప్పు లేనప్పుడు అశోక్ ను ఎందుకు దాచిపెట్టారు...!

SMTV Desk 2019-03-09 12:49:47  Vijayasai Reddy, Nara Lokesh, chandrababu Naidu, IT Grids, Data Scam, Ashok

అమరావతి, మార్చి 9: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ పై విమర్శల జల్లు కురిపించారు. డేటా చోరి వ్యవహారం పై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యస్రాలు సందించారు. డేటా స్కాం వ్యవహారంలో చంద్రబాబు తన తప్పేం లేదని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో తమ తప్పమేమి లేనప్పుడు ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ ను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. మూలాలపై దెబ్బ కొడతా, తోకలు కత్తిరిస్తానని బెదిరించేది చంద్రబాబేనని, మళ్లీ తనను భయపెడుతున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శోకాలు పెట్టేది కూడా ఆయనేన్నారు.

ఐటి గ్రిడ్స్‌ వ్యవహారం పై దర్యాప్తు మొదలైనప్పటి నుండి పప్పు నాయుడు (నారాలోకేష్‌) తలుపు వెనక దాక్కుని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై ట్వీట్లు చేయిస్తున్నాడని, డేటా దొంగ అశోక్‌ను ఎందుకు దాచాల్సి వచ్చిందో మాత్రం చెప్పడం లేదన్నారు. అదేదో బయటకు వచ్చి చెబితే వినాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.