వైసీపీకి ఎదురుదెబ్బ, టీడీపీ కండువా కప్పుకోనున్న ముఖ్య నేత

SMTV Desk 2019-03-09 11:53:01  Ganta Murali, Jaganmohan Reddy, Chandrababu Naidu, Maganti Babu, Congress, TDP, YCP, Party Changing

అమరావతి, మార్చి 9: నిన్న మొన్నటి వరకు వరుస చేరికలతో జోష్ గా ఉన్న వైసీపీకి ఎదురుబెబ్బ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి చెందినా మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి టీడీపీ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉండి ఓ వెలుగు వెలిగిన మురళి రాష్ట్ర విభజన తరువాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో వైసీపీలో చేరారు. వైసీపీలో ముఖ్య నేతగా ఉండి కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేత మాగంటి బాబుతో మురళి సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన తరువాత టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి ఆయన సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.