మోదీపై స్టాలిన్ ఫైర్

SMTV Desk 2019-03-09 11:17:50  DMK, Stalin, Narendra Modi, Congres, BJP, Rafale Deal, KK Venugopal, Documents, Missing

చెన్నై, మార్చి 9: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ పై మండిపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి రఫేల్ ఒప్పంద ఫైల్ లు మాయమయ్యయన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ, పత్రాలనే కాపాడలేని వ్యక్తి దేశాన్ని ఇంకేం రక్షిస్తారు అంటూ ప్రశ్నించారు. "నా ప్రశ్న ఏంటంటే.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లను రక్షించలేని వ్యక్తి దేశాన్ని ఎలా రక్షిస్తారన్నదే. ఇందుకోసమే బీజేపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పడింది" అని స్టాలిన్ చెప్పారు.

ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రఫేల్ డీల్ లో ఘోర కుంభకోణం జరుగుతుందని ఆరోపించగా, ఈ డీల్‌కు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి దొంగతనాని గురయ్యాయంటూ స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలపడం మరింత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం వెంటనే మాట మార్చింది. రాఫెల్ డీల్‌కు సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురికాలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పిన సంగతి తెలిసిందే.