గవర్నర్ పదవికి రాజీనామా, రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ

SMTV Desk 2019-03-09 10:31:11  Kummanam Rajasekharan, Mizoram Governor, Resigned, Lok Sabha Polls, Contesting, MLA, BJP

ఐజ్వాల్, మార్చి 9: కేరళ నుండి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖరన్‌ గతేడాది మే నెలలో మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ గవర్నర్‌ కుమ్మనమ్‌ రాజశేఖరన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు సమర్పించారు. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తిగా ముద్రపడ్డ రాజశేఖరన్‌ రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు సమాచారం. 2014 లోక్ సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుండి పోటీ చేసిన రాజశేఖరన్, కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చేతిలో ఓడిపోయారు.