పారమౌంట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసిన ఈడీ

SMTV Desk 2019-03-09 09:43:44  thyagarajan, paramount airways md, paramount airways, enforcement directorate

న్యూఢిల్లీ, మార్చ్ 08: పారమౌంట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన 28 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం 2002 ప్రకారం దర్యాప్తు చేస్తున్న ఈడీ ఎలాంటి విఘాతం కలుగకుండా ముందు ఫ్యాక్టరీ ఆవరణతోపాటు పారమౌంట్‌మిల్స్‌ ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం బ్రియర్‌నాల్‌ మిల్స్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట సంస్థను నడుపుతున్న త్యాగరాజన్‌ ఆ సంస్థలో కంట్రోలింగ్‌ వాటాను కలిగి ఉన్నారు. త్యాగరాజన్‌పై నడుసుత్న్న విచారణలో భాగంగా ఆయనకు మదురై, టెన్‌కాసిలలో 17 స్థిరాస్తులు ఉన్నాయని ఈ ఆస్తులన్ని కూడా మనీలాండరింగ్‌ చట్టం పరిదిలో అవకతవకలకు పాల్పడినవిగా ఉన్నట్లు నిర్ధారించింది. అందువల్లనే ముందు వీటిని జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.