ట్రంప్ మాజీ సలహాదారుడి పాల్‌ మానాఫోర్ట్‌కు 47 నెలల జైలు శిక్ష

SMTV Desk 2019-03-08 14:48:46  Paul Manafort Sentenced to 47 Months in Prison, ex-Trump campaign chairman, Ukrainian politicians,

అమెరికా, మార్చ్ 08: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహా దారుడు పాల్‌ మానాఫోర్ట్‌కు అమెరికా సర్కార్ షాక్ ఇచ్చింది. పాల్‌ మానాఫోర్ట్‌కు 47నెలల జైలు శిక్ష విధిస్తూ అమెరికా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పాల్‌ ఉక్రెయిన్‌ ఎన్నికల్లో రాజకీయ సలహాదారుగా పనిచేసిన సమయంలో కొన్ని వేల కోట్ల డాలర్లను అక్రమంగా దాచినందుకు గాను కోర్టు ఇప్పటికే అతన్ని దోషిగా తేల్చింది. అయితే ఇవాళ ఆయనకు శిక్ష ఖరారు చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తుకు అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికా న్యాయ విభాగానికి చెందిన స్పెషల్‌ కౌన్సిల్‌ రాబర్ట్‌ ముల్లర్‌... తన విచారణ సమయంలో మానా ఫోర్ట్‌ అవినీతిని వెలికి తీశారు. శిక్ష ఖరారు సమయంలో మానాఫోర్ట్‌కు కోర్టులో మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలు తన జీవితంలో అత్యంత క్లిఫ్టమైనవని... వృత్తిపరంగా, ఆర్థికంగా తాను కుప్పకూలిపోయాయని.. శిక్ష ఖరారు సమయంలో దయ చూపాలని కోరారు. దీనికి న్యాయమూర్తి టీఎస్‌ ఎలిస్‌ స్పందిస్తూ... చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ 47 నెలల జైలు శిక్ష విధించారు.