'ప్రేమకథాచిత్రమ్ 2' ట్రైలర్ విడుదల

SMTV Desk 2019-03-08 12:36:57  premakatha chitram 2, sumanth ashwin, nandita swetha

హైదరాబాద్, మార్చి 08: గతంలో సుధీర్ బాబు .. నందిత జంటగా నటించిన ప్రేమకథా చిత్రమ్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రమ్ 2 రూపొందింది. సుమంత్ అశ్విన్ .. నందిత శ్వేత .. సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రల కాంబినేషన్లో .. హారర్ కామెడీ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి అనే హీరో డైలాగ్ .. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా? అనే నందిత శ్వేత డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రేమకథా చిత్రమ్ మాదిరిగా .. ఈ సీక్వెల్ భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.