టీడీపీలోకి మరో వారసుడు

SMTV Desk 2019-03-08 12:22:41  Chandrababu Naidu, Rammohan, Jayaram, TDP, Chiranjeevi, Prajarajyam, Minister

అమరావతి, మార్చి 8: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీలోకి మరో వారసుడు అడుగు పెట్టారు. మాజీ మంత్రి జయరామ్ కుమారుడు రామ్మోహన్ టీడీపీలో చేరారు. గతంలో జయరాం టీడీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి విజయం సాదించారు. మంత్రిగా కూడా పని చేశారు. తరువాత సినీ నటుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ లో చేరారు. అప్పుడు ప్రజారాజ్యం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన కుమారుడు రామ్మోహన్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కోసం చిత్త శుద్ధితో పనిచేయాలని ఈ మేరకు రామ్మోహన్ కి చంద్రబాబు సూచించారు.