గంగూలీతో విడిపోవడానికి కారణం ఇదే: నగ్మా

SMTV Desk 2019-03-08 12:21:43  nagma, tollywood heroine, cricketer,

హైదరాబాద్, మార్చి 08: 90 దశకం లో తెలుగు చిత్ర పరిశ్రమని ఒక దశాబ్దం పాటు ఏలిన హీరొయిన్ లలో ఒకరు నగ్మా. ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్, భోజ్ పూరి సినిమా ఇండస్ట్రీలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ అందాల సుందరి.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నగ్మా మాట్లాడుతూ....సరైన వ్యక్తి తారసపడితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, భారతీయ వివాహ వ్యవస్థను తాను ఎంతో గౌరవిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా తెలిపారు. ప్రస్తుతానికైతే తన జీవితంలో ఎవరూ లేరని ఈ 44 ఏళ్ల భామ వెల్లడించారు.

క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీతో నగ్మాకు రిలేషన్ షిప్ ఉండేదని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని గతంలో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ.....గంగూలీ, తాను ప్రేమించుకున్న సంగతి నిజమేనని చెప్పారు. గంగూలీ కెరీర్ కోసం రిలేషన్ షిప్ కు ముగింపు పలికామని చెప్పారు. ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి వదులుకోవాలని అన్నారు.