కొన్నాళ్లు ఆగితే మీమనవడి క్లాస్ మేట్ అవుతాడు

SMTV Desk 2019-03-08 12:19:32  Vijayasai Reddy, Chandrababu Naidu, Lokesh, TDP, YCP, IT Grid, Data Leakage

అమరావతి, మార్చి 8: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్ర మధ్య సంచలనం సృష్టిస్తున్న ఐటీ గ్రిడ్ డేటా చోరి వ్యవహారం పై వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వ్యంగ్యాస్త్రాలు సందించారు. చంద్రబాబే లక్ష్యంగా ట్విట్టర్ వేదికగా చాలా కామెంట్ లు చేశారు. "అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటి? అంటూ అర్థం కాక బుర్ర గోక్కుంటున్నాడు. చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్. అలాగే శంకుపుష్పి కూడా తినిపించండి ఎయిత్ స్టాండర్డులో ఫెయిలయ్యేట్టున్నాడు. లేక పోతే కొన్నాళ్లకు మీమనవడి క్లాస్ మేట్ అవుతాడు" అంటూ ట్వీట్ చేశాడు. అలాగే, "అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని చంద్రబాబుకు అర్థమైంది. పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ గా పిలుస్తారు. తను ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడు" అని విమర్శలు గుప్పించారు. "ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం కలిగించే నాయకత్వం, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారో చెప్పే మ్యానిఫెస్టో ఉండాలని ఇప్పటి దాకా అంతా అనుకుంటున్నాం. ఈ రెండు అవసరం లేకుండానే డేటా స్కామ్ తో పవర్ లో కొనసాగేందుకు చంద్రబాబు రెండేళ్లుగా ప్లాన్ చేస్తూ వచ్చాడు" అంటూ వరుస ట్వీట్ లు చేశాడు.