ఆలోచనలో పడిన మహేశ్ బాబు

SMTV Desk 2019-03-08 12:18:21  mahesh babu, f2, anil ravipudi, sukumar, maharshi

హైదరాబాద్, మార్చి 08: ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ సినిమా చేయాల్సి ఉంది. ఓ వైపు మహర్షి పూర్తి కావొస్తున్నా సుకుమార్ సినిమా పై మహేష్ ఇంకా అయోమయంగానే ఉన్నాడు. ఆ వెంటనే అనిల్ రావిపూడి చెప్పిన లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మిల్కీ బాయ్. దీంతో మహేష్, సుకుమార్ కి నో చెప్పక తప్పలేదు.

అయితే అనిల్ రావిపూడి కూడా మహేశ్ బాబుకి పూర్తి స్క్రిప్ట్ వినిపించాల్సి ఉంది. అది మహేశ్ కి నచ్చకపోతే మళ్లీ కథ మొదటికి వస్తుంది .. ఆ తరువాత ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుంది. మహేశ్ బాబు కూడా ఇదే ఆలోచన చేసినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మహేశ్ బాబు మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెడుతున్నాడట. అనిల్ రావిపూడి కథపై పెట్టుకున్న నమ్మకంపై ఏ మాత్రం తేడా వచ్చినా, మరో దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు దర్శకులు ఎవరనేది కూడా మహేశ్ బాబు టీమ్ రహస్యంగా ఉంచిందంట!