వాళ్లు కూడా ఈ దేశంలో ఓటర్లే...

SMTV Desk 2019-03-08 11:58:20  Jayasudha, Jaganmohan Reddy, Chandrababu Naidu, Nagarjuna, Party Changing, TDP, YCP

అమరావతి, మార్చి 8: ప్రముఖ సినీ నటి జయసుధ కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే నిన్న(గురువారం) సాయంత్రం ఆమె వైసీపీలో చేరారు. హైదరాబాదులోని లోటస్‌పాండ్‌కు వెళ్లి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

గతంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కలయికపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తాజాగా జయసుధ చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించారు. జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఆ మాటలు చంద్రబాబు మాట్లాడకూడదని, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీ వాళ్లేనని జయసుధ చెప్పారు. సినీ నటులు ఎందుకు జగన్ ను కలవకూడదని ఆమె ప్రశ్నించారు. సినిమా వాళ్లంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని, వాళ్లు కూడా ఈ దేశంలో ఓటర్లేనని జయసుధ అన్నారు.