ఎమ్మెల్సీ ఎన్నికలకు సెలవు ఇస్తారా...

SMTV Desk 2019-03-08 11:57:21  MLC Elections, Amaravathi, Hyderabad, Leave

అమరావతి, మార్చి 8: ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 22న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెలవు ఇవ్వాలని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు కోరుతున్నారు. 9,10 షెడ్యూల్‌లోని సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో ఎక్కువమంది కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్లు కావడంతో సెలవు కావాలని కోరుతున్నారు. అయితే అదే రోజు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా సెలవు కోరుతున్నారు.