రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించిన జగదీష్‌ రెడ్డి

SMTV Desk 2019-03-08 11:53:58  kcr, trs, ktr, mp jagadeesh reddy

యాదాద్రి, మార్చ్ 07: తెలంగాణ మంత్రి జగదీష్‌ రెడ్డి గురువారం భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొత్త పుంతలు తొక్కించారని ఆయన అన్నారు. ఒకవైపు ఉద్యమం..మరోవైపు అభివృద్ధిని విజయవంతంగా నడిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. అలాగే చిత్తూరు జిల్లా నగరిలో పోటీ చేసినా కేసీఆర్ అద్బుతమైన మెజార్టీతో గెలుస్తరని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి నమూనాల వైపు దేశం చూస్తోందన్నారు. 100కు పైగా దేశాల్లో తెలంగాణ పదం ఉచ్ఛరిస్తున్నారంటే దానికి కారణం కేటీఆర్ అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.