జర్నలిస్టు ఖషోగ్గీని చంపి సజీవ దహనం చేసిన సౌదీ అరేబియా ప్రభుత్వం

SMTV Desk 2019-03-08 11:49:40  saudi Journalist, jamal khashoggi, burned large oven, mohammed bin salman

సౌదీ అరేబియా, మార్చ్ 07: అంతర్జాతీయ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీని సౌదీ అరేబియా ప్రభుత్వం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే హత్య అనంతరం ఖషోగ్గీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అనంతరం శరీర భాగాలను మైక్రో ఓవెన్‌లో వేసినట్లు అల్ జజీరా ఛానెల్ కథనాన్ని తాజాగా ప్రసారం చేసింది. సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషోగ్గీ.. అక్కడి రాచరిక విధానాలపైనా ముఖ్యంగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ వ్యవహారశైలిని విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్టులో కథనాలు రాసేవారు. దీంతో ఆయనపై సౌదీ రాజకుటుంబం కక్ష పెంచుకుంది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ మళ్లీ బయటికి తిరిగి రాలేదు. ఆయనను 15 మంది సౌదీ ఏజెంట్లు దౌత్య కార్యాలయంలోనే బంధింది అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి. సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంటికి తరలించినట్లుగా అల్ జజీరా తెలిపింది. అనంతరం అక్కడ ఉన్న భారీ కొలిమిలో వేసి ఆయన మృతదేహాలను మండించినట్లు పేర్కొంది. ఇప్పటికే ఖషోగ్గీ దారుణ హత్యతో సౌదీపై ప్రపంచం మండిపడుతున్న తరుణంలో శవాన్ని మాయం చేసేందుకు వినియోగించిన విధానం మరోసారి చర్చనీయాంశమైంది.