మహర్షి లేటెస్ట్ అప్ డేట్

SMTV Desk 2019-03-08 11:45:14  maharshi, mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లరి నరేష్ ఒక ప్రముఖ పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మహర్షి”.ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ పట్ల ఒక స్పష్టత వచ్చేయడంతో మహేష్ అభిమానులు కాస్త కూల్ గా ఉన్నారు.ఈ సినిమా కోసం ఒక్కొక్క వార్త బయటకు వస్తుండడంతోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.ఇప్పుడు ఈ సినిమా కోసమే మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.సాధారణంగా మన తెలుగు హీరోల అభిమానులు కోరుకునేది ఏమన్నా ఉంది అంటే వారికి దర్శకుడు ఏం చేస్తాడో తెలీదు..

వాళ్ళ అభిమాన హీరోని వెండితెరపై చూసేటప్పుడు రోమాలు నిక్కబొడిచేలా ఎలివేషన్ సీన్లు ఉండాలి.వారి ఇంట్రో సాంగ్ కి థియేటర్లో దద్దరిల్లిపోవాలి అని కోరుకుంటారు.ఇప్పుడు ఈ రెండో ఆప్షన్ కోసమే మహర్షి నుంచి ఒక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాలో మహేష్ ఇంట్రో సాంగ్ కోసం నిర్మాతలు భారీ ఖర్చు పెడుతున్నారట..ఈ పాట మహేష్ కెరీర్ లో బెస్ట్ ఇంట్రో సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని,అలాగే అందుకోసం దేవిశ్రీ చక్కని పాటను కంపోజ్ చేసారని తెలుస్తుంది.ఈ ఒక్క పాట కోసమే నిర్మాతలు 2 కోట్లు ఖర్చు పెడుతున్నారట మరి ఈ పాట థియేటర్లలో అభిమానుల చేత ఎంత రచ్చ చేయిస్తుందో చూడాలి.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మే 9 న విడుదల కానుంది.