భారీ రేటు కు సాహో ఓవర్సీస్ రైట్స్ ..!

SMTV Desk 2019-03-08 11:43:42  saaho,

బాహుబలి రెండు సినిమాలతో ప్రభాస్ భారతదేశమంతటా అపారమైన క్రేజ్ ను తన సొంతం చేసుకున్నాడు.ఆ వెంటనే మొదలు పెట్టిన సినిమా “సాహో” కూడా భారీ బడ్జెట్ చిత్రమే కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఏర్పడ్డాయి.అలాగే తనకి రెండో సినిమా అయినా సరే సుజీత్ ఎన్నో సినిమాల అనుభవం గల దర్శకునిగా ఈ సినిమాను హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమా ఈ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పడానికి చిన్న మచ్చు తునకగా ప్రభాస్ పుట్టిన రోజున కేవలం ఒక మేకింగ్ వీడియో తోనే ప్రకంపనలు రేపారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో ఓవర్సీస్ రైట్స్ భారీ రేట్ కు అమ్ముడయ్యాయని తెలుస్తుంది.

చైనా మినహాయించి ఓవర్సీస్ హక్కులు 42కోట్లకు అమ్ముడయ్యాయి, అందరు అనుకున్నట్టుగానే విడుదలకు ముందు నుండే సాహో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవలే విడుదలైన షేడ్స్ అఫ్ సాహో యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది 24గంటల్లోనే 12మిలియన్ల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. మేకింగ్ విదేవులతోనే సంచలనాలు సృష్టిస్తున్న సాహో పోను పోను టీజర్, ట్రైలర్స్ తో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.