మళ్ళి బోల్డ్ కంటెంట్ తో అలరించనున్న విజయ్ - షాలిని

SMTV Desk 2019-03-07 18:14:01  Shalini Pnadey, Vijay Devarakonda

టాలీవుడ్ సంచలన చిత్రం అర్జున్ రెడ్డి సినిమాలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. తాజాగా విజయ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రనితో ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండేని తీసుకున్నారని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం విజయ్, షాలినిల మధ్య కెమిస్ట్రీ అనే చెప్పాలి.

తెరపై వీరిమధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో చూపించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి నటించడానికి సిద్ధమవుతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు. రొమాన్స్ కి కూడా ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

ఆ సన్నివేశాల్లో విజయ్, షాలిని పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని టాక్. సినిమాలో మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ అనే మలయాళీ నటి కనిపించనుంది. ప్రముఖ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించనున్నారు.