గోవధ శిక్షను జీవిత ఖైదు గా మార్చాలి....

SMTV Desk 2017-06-01 16:50:50  cow, jaipur,

జైపూర్, జూన్ 1: పశువధ నిషేధం పై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యం లో భిన్నవాదనలు, విశ్లేషణలు ఉపందుకున్నాయి. కొందరు కేంద్రాన్ని తప్పు పడితే ..మరికొందరు పశువధ నిషేధం ను తప్పు పడుతు ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తున్నారు. పరిస్థితి ఓ వైపు ఇలా ఉంటే..రాజస్థాన్ హై కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఇందుకు కేంద్రంతో సమన్వయంగా పనిచేయా లని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ లను గోవుల చట్టబద్ద సంరక్షకులుగా ప్రకటించింది. నేపాల్ హిందూ దేశం, గోవును జాతీయ జంతువుగా ఆ దేశం ప్రకటించింది. భారత్ పశుపోషణపై ఆధారపడిన వ్యవసాయ ప్రధాన దేశం. దేశంలో గోవుకు చట్టబద్ద గుర్తింపునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అధికరణం-48, అధికరణం-51 ఏ (జీ) వీలు కల్పిస్తాయని ఆ హైకోర్టు జస్టిస్ మహేశ్ చంద్ శర్మ తన 145 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. గోవధకు విధించే శిక్షను జీవిత ఖైదుకు పెంచాలని ఆయన ఉత్తర్వుల్లో సూచించారు. రాజస్థాన్ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న హింగోనియా గోశాలలో గతేడాది వందకు పైగా ఆవులు మృత్యువాత పడటంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే విధంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసే స్వేచ్చ అందరికీ కల్పిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.. గోవులు, దూడలు, ఇతర పాలిచ్చే జంతువుల వధను నిషేదించాలని వాటి సంతతిని రక్షించాలని రాజ్యాంగంలోని అధికరణం-48 సూచిస్తుందని, ఇతర జీవుల పట్ల దయ కలిగి ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికరణం-51 ఏ(జీ) సూచిస్తుందని వెల్లడించారు.