అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలు : మహిళలకు టీఎస్ సర్కార్ పురస్కారాలు

SMTV Desk 2019-03-07 17:23:00  international womens day, telangana government

హైదరాబాద్, మార్చ్ 07 ‌: నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు కొన్ని పురష్కారాలు అందించింది. మహిళల్లో వేర్వేరు రంగాల్లో విశేష సేవలందించిన వారికి తెలంగాణ సర్కార్ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 14 విభాగాల్లో 21 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తూ బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. సాహిత్యం: డాక్టర్‌ ప్రేమలత, తస్నీమ్‌ జోహెర్‌, నృత్యం: డాక్టర్‌ కె.రత్నశ్రీ, సంగీతం: సుత్రానే కీర్తిరాణి, జానపద కళలు: శివమ్మ, మోతం జంగమ్మ, చిత్రలేఖనం: ఆచార్య గీత, హరికథ: పద్మాలయ ఆచార్య, పారిశ్రామికం: జ్యోతి వలబోజు, క్రీడలు: మిథాలీ రాజ్‌, రక్షణ సేవలు: బొడ్డపాటి ఐశ్వర్య, సాహసాలు: జై భారతీ, ఆడియో ఇంజినీరింగ్‌: సాజిదా ఖాన్‌, సామాజిక సేవలు: కమ్మరి సరస్వతి, బెల్లం మాధవి, అప్కా మల్లురమ, కడప తుకాబాయి, డాక్టర్‌ అమ్మ శ్రీదేవి, పాత్రికేయం: యశోదారాణి, రచన ముడుంబై, సామాజిక గానం: సుద్దాల భారతీ.