' ఐ డోంట్ కేర్' అంటున్న చంద్రబాబు

SMTV Desk 2019-03-07 17:16:53  chandra babu, cm kcr,

అమరావతి, మార్చ్ 07: ప్రస్తుతం ఒక పక్క తెలంగాణ మరియు ఆంద్ర రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మొదలయ్యింది.ఎందుకంటే అక్కడ ఎంపీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండగా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావం పూరించబడింది.అయితే గడిచిన తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు వహించిన పాత్ర అందరికి తెలుసు.తెరాస వ్యతిరేఖంగా చంద్రబాబు అక్కడ వాడాల్సిన వ్యూహాలను అన్నిటిని వాడేసారు.కానీ ఓటమి చూడక తప్పలేదు.దానితో కెసిఆర్ అప్పుడే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసారు.

అందుకు తగ్గట్టు గానే పావులు కదుపుతూ ఎవ్వరు ఊహించని విధంగా జగన్ తో జతకట్టి చంద్రబాబుకి షాకిచ్చారు.అయితే ఈ డేటా చోరీ విషయంపై సమావేశం పెట్టిన చంద్రబాబు కెసిఆర్ మరియు జగన్లకు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చారు.కెసిఆర్ తానొస్తే ఏమవుతుందో తెలుసా అని బెదిరిస్తున్నారని,నేను ఓడిపోతే కెసిఆర్ కి ఒక సామంత రాజ్యం కావాలి,అలా కావాలి అంటే జగన్ ను అడ్డు పెట్టుకొని వస్తున్నారని సంచలనం వ్యాఖ్యలు చేసారు.

అసలు ఈ రాష్ట్రం మీద నీకున్న హక్కేంటి? నీకేం సంబంధం ఉందంటూ కెసిఆర్ కు ప్రశ్నలు సంధించారు.అదే సమయంలో తెలంగాణాలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టే తాను అక్కడికి వచ్చి ప్రచారం చేసానని తెలిపారు.ఇప్పుడు మీరంతా కలిసి బెదిరిస్తారా బెదిరించండి,రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా ఇచ్చుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి ఐ డోంట్ కేర్ అంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేసారు.