ఎన్టీఆర్ వద్దంటే.. అల్లు అర్జున్ ఓకే అన్నాడు

SMTV Desk 2019-03-07 17:11:29  NTR, allu arjun,

మహేష్ తో సుకుమార్ సినిమా ఉంటుందని అనుకోగా అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. సుకుమార్ తర్వాత సినిమా బన్నితో చేస్తాడట. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మహేష్ చేయనని చెప్పేసరికి తిన్నగా అదే కథను అల్లు అర్జున్ కు చెప్పి ఒప్పించేశాడు సుక్కు. అయితే బన్ని దగ్గరకు వెళ్లేముందు ఈ కథను ఎన్.టి.ఆర్ కు వినిపించాడట సుకుమార్.

ప్రస్తుతం రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనని చెప్పాడు. అందుకే సుకుమార్ సినిమా ఎనౌన్స్ చేయాలని అడిగినా వద్దని చెప్పాడట. సుకుమార్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది. ఆ సినిమా తారక్ కు హిట్ అందించింది. ఎన్.టి.ఆర్ వద్దంటే బన్ని మాత్రం సుక్కు మీద ఉన్న నమ్మకంతో ఓకే అనేశాడు. మరి సుకుమార్ బన్ని హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.