టీడీపీ వెబ్ సైట్ క్లోజ్...!

SMTV Desk 2019-03-07 17:08:23  tdp party official web site, tdp.com , tdp web site closed, chandrababu

అమరావతి, మార్చ్ 07: ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార వెబ్ సైట్ ను క్లోజ్ చేసింది. ఆ వెబ్ సైట్ www.telugudesam.org ఓపెన్ చేస్తే... ఎర్రర్ వస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ అయిందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోటా విన్నా.. దీని గురించే చర్చలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో.. టీడీపీ అధికారిక వెబ్ సైట్ క్లోజ్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే.. ఈ వెబ్ సైట్ ని ఇప్పుడు టీడీపీ నేతలు కావాలనే క్లోజ్ చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం బయటపడకుండా ఉండేందుకే వెబ్ సైట్ కార్యకాలాపాలు నిలిపివేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టీడీపీ ఆన్ లైన్ సభ్యత్వాన్ని కూడా ఇంతకముందే నిలిపివేయడం గమనార్హం.